తమ కొత్త సినిమా కోసం ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న “రాజు వెడ్స్ రాంబాయి” మేకర్స్
చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా. ఈ మూవీ సక్సెస్ చిన్న చిత్రాల్లో ఎంతో స్ఫూర్తినింపింది. ఇలాంటి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న "రాజు వెడ్స్ రాంబాయి" మేకర్స్ మరో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో పుట్టిన మరో మట్టి కథ పరిమళాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మిస్తున్నారు. మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులకు మేకర్స్ ఆహ్వానం పలుకుతున్నారు. 'తెలంగాణ యాస బాస అచ్చిన తెలుగోళ్ళంతా ఈడియోలు పెట్టుర్రి' అని ప్రకటించారు. నటన పట్ల…
