తొలి వీకెండ్లో వరల్డ్‌వైడ్‌గా రూ.14.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విష్ణు విన్యాసం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్ స్థిరంగా పెరుగుతూ వచ్చిన ఈ సినిమా మంచి పబ్లిక్ టాక్‌తో స్ట్రాంగ్ కమర్షియల్ పెర్ఫార్మర్గా నిలిచింది. మొదటి రెండు రోజుల్లోనే మంచి గ్రోత్ నమోదు చేసిన ఈ చిత్రం, మూడో రోజునే రూ.5.6 కోట్ల గ్రాస్ సాధించింది. వరల్డ్‌వైడ్ తొలి వీకెండ్ కలెక్షన్స్ రూ.14.7 కోట్లకు చేరాయి. విడుదల అనంతరం వచ్చిన పాజిటివ్ పబ్లిక్ టాక్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. క్లీన్ హ్యూమర్, భావోద్వేగాలు, రీలేటబుల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువత ఫన్ ఎలిమెంట్స్‌ను ఆస్వాదిస్తుండగా, కుటుంబ ప్రేక్షకులు కథలోని ఎమోషన్ ని మెచ్చుకుంటున్నారు. సోషల్…
