Skip to content

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్ Telugu News
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్ Telugu News
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్ Telugu News

విదేశాలలో సైంటిస్ట్ గా పనిచేసి తన స్వదేశానికి తన సేవలు అందించాలని, తన తెలివితేటలు తన దేశానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో ఇక్కడ వేద టీవీ ఛానల్ ప్రారంభించారు డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల. వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్, వేద డివోషనల్, వేద మ్యూజిక్, వేద కిడ్స్, వేద 4 వెల్త్ అనే 6 ఛానెల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఛానల్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ ఛానల్ ఆవిష్కరిస్తున్న సందర్భంగా రాముని పై ఒక పాటను లాంచ్ చేయడం జరిగింది.

ఇదే సందర్భంగా ప్రత్యేకంగా వేద డివోషనల్, మ్యూజిక్ ఛానెల్స్ ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారు మాట్లాడుతూ… “ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. రాముడు పేరున ఉన్న పాటను లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. మన దేశ పునాదులను గుర్తుచేసుకుంటూ మన దేశ సంస్కృతిని గుర్తిస్తూ భవిష్యత్ కూడా ఉండేలా కోరుకుంటున్నాను. రాముడు ఒక దేవుడులా కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా గుర్తుండిపోవాలి. సరైన సమాచారాన్ని ప్రజలకు అందచేస్తూ ముందుకు వెళ్లాలని వేద ఛానెల్ ప్రేక్షకుల పట్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మామిడి హరి కృష్ణ గారు రాసిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఛానెల్ మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

లిరిసిస్ట్ మామిడి హరి కృష్ణ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ పాటను రాముడు నా చేత రాయించినట్లు నేను భావిస్తున్నాను. ప్రజలు ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్లేందుకు ఆదర్శం సీతారాములు. వాల్మీకి రామాయణం ద్వారా సీతారాములు ప్రయాణం తెలుసుకున్నాము. ప్రస్తుత తరానికి అర్థం అయ్యే విధంగా ఈ పాటను రచించడం జరిగింది. శ్రీరాముడిలో మనిషికి ఉండవలసిన అన్ని గొప్ప కోణాలు ఉన్నాయి. వేద టివి ఛానెల్ ద్వారా ఈ పాట ఒక ఆరంభ గీతంగా రావడం చాలా సంతోషకరం. ఈ పాటను రామచంద్ర గారు ఆవిష్కరించడం మరొక సంతోషకరమైన విషయం. వేద టివి ఛానెల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు.

వేద టివి చైర్మన్ డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారికి, మా ఛానెల్ ప్రారంభించేందుకు పాటను అందించిన మామిడి హరి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేద ఛానెల్ ద్వారా ప్రజలకు మంచి చేసేలా సేవలు అందిస్తామని, సరైన సమాచారం ప్రజలకు అందచేస్తామని తెలియజేసుకుంటున్నాను” అన్నారు.

నటి సిరి రావులచారి మాట్లాడుతూ… “సాధారణంగా ఒక పాట ముందు అంత చూసుకున్నాక వెళ్తాను కాని ఈ పాట కోసం, రాముడు కోసం చేసినట్లు అనిపించింది. వేద టివి ఛానెల్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు అక్షిత్ మార్వెల్ మాట్లాడుతూ… “ప్రస్తుత ట్రెండ్ కు కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఈ తరానికి అర్థం అయ్యేలా ఒక పాటను చేయడం చాలా సంతోషం. రాముడు పాటలో కనిపించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మాకు అవకాశం ఇచ్చిన వేద టివి ఛానెల్ వారికి థాంక్స్. వేద టివి ఛానెల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

లక్ష్మీశ్రీ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ రాముని పాట నాకు చాలా నచ్చింది. నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. వేద టివి ఛానెల్ కు ఈత సపోర్ట్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారికి, మామిడి హరి కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. మా వేద టివి ఛానెల్ కు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

ఇదే సందర్భంగా పిల్లల చేతుల మీదగా వేద కిడ్స్, శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదగా వేద న్యూస్, మామిడి హరి కృష్ణ గారి చేతుల మీదగా వేద ఎంటర్టైన్మెంట్, లక్ష్మీశ్రీ గారి చేతుల మీదగా వేద 4 వెల్త్ ఛానెల్స్ లాంచ్ చేయడం జరిగింది. వేద టివి ఛానెల్ కు రాజేష్, ప్రకాష్ సిఈఓగా వ్యవహరిస్తున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.