బాలయ్య బాబుగారిని ప్రేమిస్తే నో బ్రేకప్స్... ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది: ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్…
హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ‘నాగబంధం’ అద్భుత ప్రచార యాత్ర
అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిపేందుకు చిత్రబృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను ప్రకటించారు.
సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమం ద్వారా సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయనున్నారు.
ఈ టూర్‌లో తొలి కార్యక్రమం జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్. సినిమా స్థాయి, విజువల్స్, కథపై మరింత ఆసక్తిని పెంచేలా ఈ ఈవెంట్ ఉండనుంది.
అనంతరం జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా దేశవ్యాప్తంగా సినిమా రీచ్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది.
ఈ ప్రమోషనల్ టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ పాట విడుదల కానుంది. వారణాసి నగరానికి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత సినిమా టైటిల్, కథలోని నేపథ్యానికి అద్భుతంగా వుంటుంది.
అలాగే జూన్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. విడుదలకు ముందు రోజు జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, చిత్రబృందం ఈ ప్రమోషనల్ జర్నీని ఘనంగా సెలబ్రేట్ చేయనుంది.
‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పింది. ఈ భారీ ప్రమోషనల్ టూర్‌తో ఆ ఆసక్తి మరింత పెరగనుంది.
నాగబంధం’ నైజాం థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు, చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

