Skip to content

ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్

ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి  చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ Telugu News
ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి  చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ Telugu News

▪️జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ ‘కొత్త మలుపు’

▪️‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ చేసిన ఎ. కోదండరామి రెడ్డి

హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించిన శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని యశ్వంత్ నాగ్ అందించారు.

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ఆశీర్వదించిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.

నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, “మా సినిమా బాగుందని బ్లెస్సింగ్ అందించిన ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇది నాకు తొలి సినిమా. దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్‌కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. కమెడియన్ మహేంద్ర సినిమా లో చేసిన కామెడీ హైలెట్ గా నిలుస్తుందని అన్నారు..

హీరో ఆకాష్ గోపరాజు మాట్లాడుతూ, “ ముందుగా మా సినిమాను మా చిత్ర యూనిట్ ను అభినందించిన కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ భైరవి అర్ధ్యా మాట్లాడుతూ, “నా కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి” అని పేర్కొన్నారు.

చిత్ర యూనిట్ సభ్యుల ప్రకారం, ‘కొత్త మలుపు’ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందింది. జూన్ 12న విడుదల కానున్న ‘కొత్త మలుపు’ ప్రేక్షకులకు ప్రేమ, సస్పెన్స్, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో కూడిన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు
ఆకాష్ గోపరాజు – హీరో
భైరవి అర్ధ – హీరోయిన్
రఘుబాబు
పృథ్వీరాజ్
ప్రభావతి
మహేందర్
డి.డి. శ్రీనివాస్
కిట్టయ్య
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: శివ వరప్రసాద్ కేశనకుర్తి
నిర్మాత: తాటి బాలకృష్ణ
ప్రొడక్షన్ బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రాఫర్లు: జవహర్ రెడ్డి ,సుమంత్ కాచర్ల,
కొరియోగ్రాఫర్: చంద్రకిరణ్
పిఆర్‌ఓలు: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.