Skip to content

తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా “సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా “సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల Telugu News
తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా “సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల Telugu News
తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా “సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల Telugu News
తమ్మారెడ్డి భరద్వాజ, వీఎన్ ఆదిత్య చేతుల మీదుగా “సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల Telugu News

తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – “నీటి సమస్య అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కీలకమైన అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా రూపొందించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.

తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, “సర్కారు బాయి” కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి కథతో వచ్చే సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఉండటం పరిశ్రమకు గొప్ప విషయం. నా అభిమాన క్రికెటర్ లారా లాగానే దర్శకుడు లారా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ, “తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలతో కూడిన కథలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి కథలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు లారా గారికి కృతజ్ఞతలు. నిర్మాత ప్రఫుల్ రాంరెడ్డి మాకు కుటుంబ పెద్దలాంటివారు. ఈ చిత్రంలో భాగస్వామి కావడం గర్వంగా ఉంది” అని అన్నారు.

హీరోయిన్ వర్షిక మాట్లాడుతూ, “నేను తెలుగమ్మాయిని. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవార్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ప్రేక్షకులందరూ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

దర్శకుడు లారా మాట్లాడుతూ, “చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘సర్కారు బాయి’ వద్ద అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలకథ. 1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, కుల వివక్ష, సామాజిక అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తెలంగాణలో జరిగిన ఓ హృదయ విదారక సంఘటనను తెరపై ఆవిష్కరిస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నాం” అని తెలిపారు.

నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ, “నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సమాజానికి సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రముఖ నటీనటులతో ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం. అవార్డులు సాధించే స్థాయి చిత్రంగా నిలుస్తుంది. అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ, “ఈ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది. ‘సర్కారు బాయి’ అనే టైటిల్‌నే చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు మోహన్ బైరాగి మాట్లాడుతూ, “ఉద్యమాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఈ సినిమా రూపొందుతోంది. సామాజిక బాధ్యతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

నీటి హక్కు, సామాజిక సమానత్వం, కుల వివక్ష వ్యతిరేక పోరాటం వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించనున్న ‘సర్కారు బాయి’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నటీనటులు శ్రీరామ్ నిమ్మల, వర్షిక, బాహుబలి ప్రభాకర్, వివ రెడ్డి, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, అతిథి తదితరులు

టెక్నికల్ టీం
నిర్మాత: తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
దర్శకుడు: లారా
హీరో: శ్రీరామ్ నిమ్మల
హీరోయిన్: వర్షిక
సంగీతం: కె. శివా
కాస్ట్యూమ్ డిజైనర్: మాధవి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.