Skip to content

‘సింగ్ గీతం’లో చాలా యూనిక్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ అహల్యా బమ్రూ

‘సింగ్ గీతం’లో చాలా యూనిక్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ అహల్యా బమ్రూ Telugu News
‘సింగ్ గీతం’లో చాలా యూనిక్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ అహల్యా బమ్రూ Telugu News
‘సింగ్ గీతం’లో చాలా యూనిక్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ అహల్యా బమ్రూ Telugu News
‘సింగ్ గీతం’లో చాలా యూనిక్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ అహల్యా బమ్రూ Telugu News

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సింగ్ గీతం’ తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అహల్యా బమ్రూ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?
-మాది పుదుచ్చేరి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ వంటి భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను. నేను ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్ గారు నా కంటెంట్ చూసి ఈ సినిమా గురించి చెప్పారు. నా ఆడిషన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇచ్చాను (నవ్వుతూ)

-ఇది సంగీతం నేపథ్యంలో ఉండే సినిమా. నాకు పాటలు పాడటం, గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇది నాకు తెలుగులో మంచి ఆరంభం అవుతుందని అనుకున్నాను. ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

-సింగీతం గారి దర్శకత్వం, నాగ్ అశ్విన్ గారి నిర్మాణం, వైజయంతి మూవీస్ బ్యానర్ అనగానే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను ఒప్పుకున్నాను.

సింగీతం శ్రీనివాసరావు గారితో పని చేయడం ఎలా అనిపించింది?
-ఆయన అద్భుతమైన దర్శకుడు. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. ఆయన దర్శకత్వంలో పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సింగీతం గారు తీసిన చిత్రాలన్నీ కూడా కాలానికి ముందున్నవే. సింగ్ గీతం కూడా అలాంటి సినిమానే. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్ ఇది. 94 ఏళ్ల వయసులో కూడా ఇంత మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం ఆయనకే సాధ్యం.

సినిమా మొదటి రోజు సెట్స్‌కి వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
-చాలా భయపడ్డాను. ఎందుకంటే నాకు తెలుగు రాదు. అయితే ఈ సినిమా యూనిట్ అంతా కుటుంబంలా కలిసిపోయింది. సినిమా ప్రారంభానికి ముందే నేను ఆన్‌లైన్‌లో తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆ శిక్షణ నాకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు కొద్దికొద్దిగా తెలుగు మాట్లాడగలుగుతున్నాను.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
-సింగీతం గారు పాత్రలను ఎంత అద్భుతంగా రాస్తారో అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో మహిళా పాత్రలు చాలా బలంగా, స్వతంత్రంగా ఉంటాయి. ఇందులో నా పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇది సాధారణ క్లాసికల్ హీరోయిన్ పాత్ర కాదు. నా పాత్రకు తనకు ఏమి కావాలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర. ఇందులో విలన్ పాత్ర కూడా ఒక అమ్మాయే చేస్తోంది. ఇది చాలా అరుదైన విషయం. ఈ కథ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.

దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం గురించి?
-ఇప్పటికే విడుదలైన “ఏమైంది ఏమైంది”, “హలో బాసు” పాటలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ చిత్రానికి చాలా ప్రత్యేకమైన సంగీతాన్ని అందించారు. ఆయన జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు చాలా యూనిక్‌గా ఉంటాయి.

సినిమా ఎలా ఉండబోతోంది?
-ఇది చాలా కొత్త జానర్‌లో రూపొందిన సినిమా. ఇలాంటి సినిమాను మీరు ఇంతవరకు చూసి ఉండరు. జూన్ 11న థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలి.

నాగ్ అశ్విన్ గారి సపోర్ట్ గురించి?
-నాగ్ అశ్విన్ గారి ఇన్‌వాల్వ్‌మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సింగీతం గారికి అభిమాని. ఆయన అభిరుచి కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది.
ప్రతి నటుడితో మాట్లాడి చాలా విలువైన సూచనలు ఇచ్చేవారు. దర్శకత్వం ణ మొత్తం సింగీతం గారిదే. అయితే సినిమా మరింత బాగా రావడానికి అవసరమైన ప్రతిదాన్ని నాగ్ అశ్విన్ గారు చూసుకున్నారు. క్రియేటివ్ ప్రాసెస్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.

నిర్మాతల గురించి?
వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రియాంక గారు, స్వప్న గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కొత్త తరహా కథలను ప్రేక్షకులకు అందించాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. వారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.

ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు?
బాలీవుడ్‌లో దర్శకుడు షూజిత్ సిర్కార్ గారి దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ గారితో ఒక సినిమా చేశాను. సింగ్ గీతం నాకు రెండో సినిమా. అలాగే తెలుగులో ఇది నా తొలి చిత్రం.

-నాకు సౌత్ ఇండియా అంటే చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ప్రేక్షకులు ఉన్న పరిశ్రమలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.

మీ డ్రీమ్ రోల్ ఏమిటి?
-నాకు యాక్షన్ సినిమాలు చేయడం చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను.

మీకు తెలుగులో ఇష్టమైన హీరో ఎవరు?
-మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బ్రిలియంట్ యాక్టర్.

ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాలు?
-ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.