Skip to content

సంచలనం సృష్టిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్

సంచలనం సృష్టిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్ Telugu News

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళేలా కొత్త పోస్టర్ విడుదలైంది.

పవన్ కళ్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యాణ్ అద్భుతమైన లుక్ కి ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి ఈ చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది.

ప్రారంభం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రచార చిత్రాలు సంచలనంగా మారి, అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ భారీ బజ్ సృష్టించాయి. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రతి పాట పవర్ స్టార్ ఆరాను మరింతగా ఆవిష్కరిస్తూ, అభిమానులను ఆకట్టుకుంటుంది.

అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమాభిమానాలతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. తాజా పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని, అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.

ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, త్వరలోనే చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేక వీడియో ద్వారా చిత్రంలోని స్థాయి, తీవ్రత, మాస్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ గ్లింప్స్‌ అభిమానులకు అసలు సిసలైన మాస్ విందుని అందించనుంది.

గతంలో ‘గబ్బర్ సింగ్’తో సంచలనాలు సృష్టించిన బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అన్ని అంశాల మేళవింపుతో సంపూర్ణ వినోదభరిత చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో చిత్రానికి మరింత హై వోల్టేజ్ ఎనర్జీని అందిస్తున్నారు.

అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరోసారి మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.