Skip to content

ఇంట్రెస్టింగ్‌గా విశాల్ 35వ ప్రాజెక్ట్ ‘మకుటం’ టైటిల్ టీజర్ విడుదల

ఇంట్రెస్టింగ్‌గా విశాల్ 35వ ప్రాజెక్ట్ ‘మకుటం’ టైటిల్ టీజర్ విడుదల Telugu News

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం 35వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంత వరకు విశాల్ 35 అంటూ ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక కాసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను రివీల్ చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు.

విశాల్, అంజలి, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ‘మకుటం’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ మేరకు వదిలిన టీజర్‌ను గమనిస్తే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది. సముద్రం లోపలి జీవరాశుల్ని చూపిస్తూ.. చివరగా విశాల్‌ను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ‘మకుటం’ చిత్రంలో విశాల్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది.

‘మకుటం’ టైటిల్ టీజర్‌లో జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సాంకేతిక సిబ్బంది
నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్‌బి చౌదరి
దర్శకుడు: రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.