Skip to content

సూర్య ‘కరుప్పు’ టైటిల్ లుక్ రిలీజ్

IMG_4569

సూర్య తన మాగ్నమోపస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #సూర్య45 కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. తమిళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ చిత్రానికి ‘కరుప్పు’ అని టైటిల్ పెట్టారు. దర్శకుడు ఆర్జే బాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్ లుక్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది, సూర్య చేతిలో కత్తి పట్టుకుని, అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా ఫెరోషియష్ అవతార్ లో కనిపించారు. సినిమా యాక్షన్‌తో నిండి ఉంటుందని, సూర్య వైల్డ్ పాత్రలో కనిపిస్తాడని పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన చిత్రాల్లో కరుప్పు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. మంచి ఎంటర్‌టైనర్‌లను తీసే ఆర్జే బాలాజీ బడ్జెట్, విజన్. స్టార్ కాస్ట్ పరంగా కరుప్పుతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తున్నారు.

రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష కృష్ణన్ తిరిగి ఈ చిత్రంలో జోడిగా నటిస్తున్నారు. ఇద్దరూ తమ మునుపటి చిత్రాలతో పోలిస్తే భిన్నమైన మేకోవర్‌లో కనిపిస్తారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు,

వైరల్ హిట్‌లు అందించే యువ సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ కరుప్పు కి మ్యూజిక్ అందిస్తున్నారు.అనేక విజయవంతమైన చిత్రాలకు పని చేసిన జికె విష్ణు డీవోపీగా వర్క్ చేస్తున్నారు. కలైవానన్ ఎడిటర్. తమ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీతో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్న ముగ్గురు స్టంట్ కోఆర్డినేటర్లు అన్బరివ్, విక్రమ్ మోర్ ద్వయం, కరుప్పులో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అరుణ్ వెంజరమూడు.

చిన్న ప్యాచ్‌వర్క్ మినహా షూట్ మొత్తం పూర్తయింది. అదే సమయంలో టీం పోస్ట్-ప్రొడక్షన్‌పై కూడా పని చేస్తోంది. నిర్మాతలు ముందుగా చెప్పినట్లుగా, కరుప్పు ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సరైన చిత్రం. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

తారాగణం: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి
రచన & దర్శకత్వం: RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ – జికె విష్ణు
సంగీతం – సాయి అభ్యంకర్
యాక్షన్ : అన్బరివ్ – విక్రమ్ మోర్
ఎడిటర్ – ఆర్.కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ – అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు: ప్రకాష్ బాబు – ఎస్.ఆర్. ప్రభు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.