Skip to content

‘కాంత’ నుంచి రాప్ ఆంథమ్ “రేజ్ ఆఫ్ కాంత” రిలీజ్

‘కాంత’ నుంచి రాప్ ఆంథమ్ “రేజ్ ఆఫ్ కాంత” రిలీజ్ Telugu News

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న రిలీజ్ కానుంది. 1950మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంత అద్భుతమైన ప్రేమకథతో పాటు మూవీ వరల్డ్ కి ట్రిబ్యూట్. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు.

టీజర్, సాంగ్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు రాప్ ఆంథమ్ “రేజ్ ఆఫ్ కాంత” రిలీజ్ చేశారు.

ఝాను చాంతర్ స్వరపరిచిన ఈ సాంగ్ అదిరిపోయింది. వింటేజ్ ఎలిమెంట్స్‌ను ఆధునిక రాప్ బీట్స్, పవర్‌ఫుల్ గిటార్ సౌండ్స్‌తో మేళవిస్తూ రూపొందించిన ఈ ట్రాక్‌ “కాంత” సినిమా నుండి ఎలాంటి ఎనర్జీ, ఇంటెన్సిటీని ఆశించవచ్చో చెప్పేస్తోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డానీ సాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్షన్‌ను థా. రామలింగం. అదనపు స్క్రీన్‌ప్లేను తమిళ్ ప్రభ ఇచ్చారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్.

తారాగణం: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
బ్యానర్లు: స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయికృష్ణ గద్వాల్, సుజయ్ జేమ్స్
లైన్ ప్రొడ్యూసర్ – శ్రవణ్ పాలపర్తి
DOP – డాని శాంచెజ్ లోపెజ్
ఆర్ట్ డైరెక్టర్ – తా. రామలింగం
అదనపు స్క్రీన్ ప్లే – తమిళ్ ప్రభ
సంగీతం – ఝను చంతర్
ఎడిటర్ – లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్
కాస్ట్యూమ్ డిజైనింగ్: పూజిత తాడికొండ, అర్చనరావు, హర్మాన్ కౌర్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.