Skip to content

‘గోదారి గట్టుపైన’ నుంచి ‘ఓ మై గాడ్’ రిలీజ్

‘గోదారి గట్టుపైన’ నుంచి   ‘ఓ మై గాడ్’ రిలీజ్ Telugu News

‘మేమ్ ఫేమస్’ తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ బ్రీజ్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ చూడు చూడు తో మంచి బజ్ సృష్టించిన తర్వాత మేకర్స్ ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా రెండవ పాట ‘ఓ మై గాడ్’ ను విడుదల చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ ఈ పాటలో రొమాన్స్‌కు కొత్త టచ్ ఇచ్చారు. ఫన్ బీట్‌లను హార్ట్‌బ్రేక్ ఫీలింగ్‌తో మిక్స్ చేసి, బాధను కూడా సెలబ్రేషన్‌లా మార్చారు. లిరిసిస్ట్ వెంగి,అమ్మాయిల అప్రిడిక్టబుల్ నేచర్‌పై ఆకట్టుకునే లైన్స్ రాసి, హీరోతో పాటు వినేవారినీ అలరించారు. సింగర్ గానా బాలా తన పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటను మరింత ఎనర్జీగా తీసుకెళ్లగా, కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి ఫాస్ట్, కలర్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో ఈ పాటకు వైల్డ్ వైబ్ తీసుకొచ్చారు.

సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ డాన్స్‌లతో సర్‌ప్రైజ్ చేశారు. లవ్ ఫెయిల్యూర్‌ను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికీ ఈ పాట ఒక సెల్యూట్‌లా మారి, బాధను కాన్ఫిడెన్స్‌గా మార్చే ఫీలింగ్ ఇస్తుంది.

ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రొడక్షన్ డిజైన్ ప్రవాల్య, ఎడిటింగ్ అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.