Skip to content

సామాన్యుడి నుంచి సీఎం వరకు.. రేవంత్ రెడ్డి ప్రస్థానం

సామాన్యుడి నుంచి సీఎం వరకు.. రేవంత్ రెడ్డి ప్రస్థానం Telugu News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసిన గిరి నల్ల. చిన్ననాటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేయాలని ఉన్న ఆలోచనను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకుని ఒక యోధుని ప్రజాపాలన అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని చిత్రీకరించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నరసన్న(నల్గొండ గద్దర్), కోదండరామిరెడ్డి, ఓ ఎస్ డి శ్రీధర్ పాల్గొన్నారు.

ఈ డాక్యుమెంటరీ ని చూసి వారందరూ సామాన్యుడి నుంచి యోధుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తీసిన ఈ డాక్యుమెంటరీ తీసిన గిరి నల్లను అభినందనలతో ముంచేత్తారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ : మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద తీసిన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని చాలా బాగా తీశారు. దర్శకుడు గిరి నల్ల ఈ కథ తీస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నా వంతు సహాయం అందించాను. రేవంత్ రెడ్డి గారి బాల్యం నుంచి జరిగిన విషయాలన్నీ చాలా బాగా చూపించారు. సామాన్య మానవుడి నుంచి ఒక విజినరీగా ఆయన ఎదిగిన తీరును ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ గారి పేరు ఎలా గుర్తొస్తుందో సన్న బియ్యం అనగానే రేవంత్ రెడ్డి అన్న పేరు గుర్తొచ్చేలాగా చేసిన పాలన ఆయనది. ఒక యోధుని ప్రజాపాలన చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను అని అన్నారు.

నరసన్న (నల్గొండ గద్దర్) మాట్లాడుతూ : నేను కాంగ్రెస్ పాలన మీద రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో పాటలు రాశాను పాడాను. అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఎన్నో మంచి పాటలను అందించే అవకాశాన్ని కల్పించిన గిరి నల్ల కి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి అన్న పాలన నిజంగా ప్రజాపాలనని ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు. ఈ చిత్రాన్ని అందరూ చూసి నిజమైన ప్రజాపాలన అంటే ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

కోదండరామిరెడ్డి గారు మాట్లాడుతూ : గిరి నల్ల తనకు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈ కథను నాకు చెప్పినప్పుడు నాకు రేవంత్ రెడ్డి అన్న గురించి తెలిసిన విషయాలను పంచుకొని ఈ చిత్రాన్ని ఇంత బాగా చిత్రీకరించేలాగా నా వంతు సహాయాన్ని అందించెను. ఎక్కడ బోర్ కొట్టకుండా రేవంత్ రెడ్డి గారి గురించి నా సోదరుడు గిరి నల్ల చాలా బాగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. చిత్రాన్ని అందరూ చూడాలని రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఎస్ టి శ్రీధర్ గారు మాట్లాడుతూ : మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తీసిన ఈ చిత్రం నిజంగా ఆయన ఒక యోధుడిగా ఎలా ఎదిగాడు అనేది మనకు చూపించారు. ఆయన నిజంగా ఒక విజినరీ. అది చిత్రంలో చక్కగా చూపించిన గిరి నల్ల ని అభినందిస్తున్నాను అని అన్నారు.

దర్శకుడు గిరి నల్ల మాట్లాడుతూ : నిజమైన యోధుడు మా రేవంత్ రెడ్డి అన్న. ఆయన మీద ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న అనగానే నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన అద్దంకి దయాకర్ అన్నకి నరసన్న కి కోదండరామిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అన్న గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆయన జీవితాన్ని ఒక యోధుడిగా ఎలా మలుచుకున్నారు నిజమైన ప్రజాపాలన్ని ఎలా ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించాను. ఈ చిత్రాన్ని చూసి అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.