Skip to content

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ రోజు బాలనటి ఖుషి పుట్టినరోజు సందర్భంగా “సమ్మర్ హాలిడేస్” చిత్రం నుంచి ఆమె బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. బాలనటి ఖుషి “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూతురి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది.
“సమ్మర్ హాలిడేస్” మూవీ ఖుషికి మరింత పేరు తీసుకురానుంది. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోనుంది.

నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.