Skip to content

ఈ నెల 25న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాట విడుదల

ఈ నెల 25న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాట విడుదల Telugu News

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

‘గురుతుందా…’ పాటతో “చెన్నై లవ్ స్టోరీ” మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 25న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎమోషనల్ లవ్ సాంగ్ గా ‘వదలనే..’ ఉండబోతున్నట్లు అనౌన్స్ మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే “చెన్నై లవ్ స్టోరీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.