Skip to content

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన “రెనర్జైజ్ 2026” క్లీన్ ఎనర్జీ కాంక్లేవ్

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన “రెనర్జైజ్ 2026” క్లీన్ ఎనర్జీ కాంక్లేవ్ Telugu News
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన “రెనర్జైజ్ 2026” క్లీన్ ఎనర్జీ కాంక్లేవ్ Telugu News
హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన “రెనర్జైజ్ 2026” క్లీన్ ఎనర్జీ కాంక్లేవ్ Telugu News

“రెనర్జైజ్ 2026” భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ ‘క్లీన్ ఎనర్జీ విప్లవం’ తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతలు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకువచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించుకోవాలని కోరారు.

రెంజీ (RENGY)
భారతదేశ ఇంధన పరివర్తన (Energy Transition), వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు (Decentralized Energy Systems), మరియు క్షేత్రస్థాయిలో వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చకు ‘Renergize 2026’ ఒక వేదికగా నిలిచింది.

ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా Rengy సంస్థ తమ రాబోయే ‘పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్’ ను ప్రకటించింది. దీని ద్వారా గృహ వినియోగదారులు తమ వద్ద మిగిలిపోయిన అదనపు సోలార్ విద్యుత్తును ఒక నెట్‌వర్క్ ద్వారా ఇతరులకు అమ్ముకోవచ్చు. ఇది వినియోగదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వికేంద్రీకృత ఇంధన వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

దీంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్ వినియోగదారులకు విక్రయాల తర్వాతి సేవలు (after-sales service) మరియు లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి Rengy సంస్థ తమ కస్టమర్ యాప్ (Customer App) మరియు AMC (యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) ప్లాట్‌ఫారమ్‌ ను ప్రారంభించింది. ఇది సోలార్ సిస్టమ్స్ యొక్క పనితీరును, నమ్మకాన్ని పెంచి, దీర్ఘకాలిక వినియోగానికి దోహదపడుతుంది.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు స్వయంసమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.తదేశ క్లీన్ ఎనర్జీ, స్టార్టప్ & పాలసీ లీడర్‌షిప్ ఫోరం

భారతదేశ ఎనర్జీ భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు మరియు సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో AI ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ “రెంజీ (RENGY)” ఆధ్వర్యంలో “రెనర్జైజ్ 2026” జాతీయ స్థాయి కాంక్లేవ్ శనివారం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్స్ గ్రూప్ ఛైర్మెన్ రామేశ్వర్ రావు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.రమేష్ రెడ్డి, తెలంగాణ రెడ్కో ఎండి
అనిలా వావిళ్ల సహా పలువురు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో తొలి సారిగా ఏఐ ఆధారిత సేవలు అదిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ “రెంజీ (RENGY)” కీ ఫీచర్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ‘రెంజీ’ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. సాంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడకుండా, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ ‘క్లీన్ ఎనర్జీ విప్లవం’ తీసుకొచ్చారు. ఇవాళ దేశంలో ‘రెన్యూవబుల్ ఎనర్జీ’ వినియోగం అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా, ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. ఇంటిటింకి సోలార్ కరెంట్ అందించేందుకు పీఎం సూర్య ఘర్ యోజన, రైతలు తమ పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పీఎం కుసమ్ యోజన, ఇందన ఉత్పత్పిలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిపేందుకు నేషనల్ సోలార్ మిషన్ స్కీంలను కేంద్రం తీసుకువచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతోపాటు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించుకోవాలని కోరారు.

రెంజీ (RENGY)
భారతదేశ ఇంధన పరివర్తన (Energy Transition), వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు (Decentralized Energy Systems), మరియు క్షేత్రస్థాయిలో వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చకు ‘Renergize 2026’ ఒక వేదికగా నిలిచింది.

ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా Rengy సంస్థ తమ రాబోయే ‘పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్’ ను ప్రకటించింది. దీని ద్వారా గృహ వినియోగదారులు తమ వద్ద మిగిలిపోయిన అదనపు సోలార్ విద్యుత్తును ఒక నెట్‌వర్క్ ద్వారా ఇతరులకు అమ్ముకోవచ్చు. ఇది వినియోగదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వికేంద్రీకృత ఇంధన వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

దీంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్ వినియోగదారులకు విక్రయాల తర్వాతి సేవలు (after-sales service) మరియు లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి Rengy సంస్థ తమ కస్టమర్ యాప్ (Customer App) మరియు AMC (యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) ప్లాట్‌ఫారమ్‌ ను ప్రారంభించింది. ఇది సోలార్ సిస్టమ్స్ యొక్క పనితీరును, నమ్మకాన్ని పెంచి, దీర్ఘకాలిక వినియోగానికి దోహదపడుతుంది.

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు స్వయంసమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.