Skip to content

సినికేథన్ 2026 వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో జరిగిన సినికేథన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు భారత క్రియేటివ్ ఎకానమీ కి జాతీయ స్థాయి ఏకీకృత వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను అధికారికంగా ప్రారంభించారు.

భారతీయ ఫిల్మ్ , మీడియా మరియు క్రియేటివ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రతిభావంతులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చే దిశగా CCO ఆవిర్భావం చారిత్రాత్మక ముందడుగు.

CCO లక్ష్యం:

డైరెక్షన్ , రైటింగ్ , యాక్టింగ్ , సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ , మ్యూజిక్& సౌండ్ , ఆర్ట్ డైరెక్షన్& ప్రొడక్షన్ డిజైన్ , వీఎఫ్స్ /అనిమేషన్& డిజిటల్ కంటెంట్ , ప్రొడ్యూసింగ్ వంటి సినీ రంగంలోని తొమ్మిది ప్రధాన క్రాఫ్ట్స్‌కు చెందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం. పరస్పర సహకారం, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ , స్కిల్ డెవలప్మెంట్ , క్రియేటర్ వెల్ఫేర్ ‌తో పాటు ఒరిజినల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ(IP) సృష్టి, పరిరక్షణ మరియు వాణిజ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

CCO Founder Presidentగా శ్రీ వీర శంకర్, Founder General Secretaryగా శ్రీ పి.జి. విందా వ్యవహరిస్తుండగా, భారత Creative Ecosystem‌లోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా CINICA Creators Council Founder Directors శ్రీ పి.జి. విందా మరియు శ్రీ పంజా శ్రవణ్ మాట్లాడుతూ, “వేగంగా విస్తరిస్తున్న భారత క్రియేటివ్ ఎకానమీ కి CCO ఒక కీలకమైన సంస్థ. ప్రస్తుతం ఉన్న అసోసియేషన్స్ , గిల్డ్స్ , కౌన్సిల్స్ లేదా క్రియేటర్ బాడీస్ ‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు. వాటన్నింటినీ ఒకే కొల్లబొరేటివ్ నేషనల్ ప్లాట్ఫార్మ్ ‌పై అనుసంధానించి, నౌలెడ్జ్ షేరింగ్ మరియు కలెక్టివ్ గ్రోత్ ‌కు దోహదపడటమే CCO ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.

CCO చేపట్టబోయే మొట్టమొదటి కార్యాచరణ “Collective Script-Creation Model”ను Founder President శ్రీ వీర శంకర్ ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.