Skip to content

‘ఇమ్మోర్టల్’ నుంచి ‘లవ్-వు లవ్-వు రాకాసి’ సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలోని ‘లవ్-వు లవ్-వు రాకాసి’ సాంగ్ రిలీజ్ చేశారు. యువతను అలరించే క్యాచీ ట్యూన్, ఉత్సాహభరితమైన బీట్‌లతో రూపొందిన ఈ పాట ఇప్పటికే మంచి స్పందనను అందుకుంటోంది.

ఈ పాటకు సామ్ సి.ఎస్ అద్భుతమైన ట్యూన్ అందించగా, అరవింద్, రేష్మా శ్యామ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. ప్రేమలోని సరదా, అల్లరి భావాలను ప్రతిబింబించేలా రాజ్‌శ్రీ సుధాకర్ సాహిత్యాన్ని అందించారు.

మెలోడీ, బీట్, లిరిక్స్ సమన్వయంతో రూపొందిన ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కలర్ ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డాన్స్ మూవ్‌మెంట్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో రూపొందిన ఈ గీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచుతోంది.

నటీనటులు : జివి ప్రకాష్ కుమార్, కయదు లోహర్, TM కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, పెమ త్సంచో, సునీతా శ్రేష్ఠ

బ్యానర్: ఎకె ఫిల్మ్ ఫ్యాక్టరీ
రచన, దర్శకత్వం: మరియప్పన్ చిన్న
నిర్మాత: అరుణ్‌కుమార్ ధనశేఖరన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ రాధాకృష్ణన్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: రాజేష్ ఎం
ఆర్ట్ డైరెక్టర్: శివశంకర్
స్టంట్స్ : ఆర్.శక్తి శరవణన్, జి.ఎన్.మురుగన్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
కొరియోగ్రఫీ : ఎం. షరీఫ్, శబరీష్
కాస్ట్యూమ్ డిజైనర్: వినోద్ సుందర్, తమిళ్సెల్వన్ UK
PRO: వంశీశేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.