Skip to content

‘శ్రీనివాస మంగాపురం’ జూలై 30న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఆకట్టుకునే ప్రచార చిత్రాలు, వీడియోలతో ఈ సినిమా ఇప్పటికే మంచి ఆదరణను పొందుతోంది.

ఈ రోజు చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురంను సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల్లో జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ తమ క్యూట్ లుక్స్‌తో పాటు ఆకట్టుకునే నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు.

ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. జయకృష్ణ ISC సినిమాటోగ్రఫీని నిర్వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మాధవ్ కుమార్ గుళ్ళపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నటీనటులు: జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు

సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి. కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ (DOP): జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.