Skip to content

హృదయం మురళి అందరికీ రిలేట్ అయ్యే సినిమా: హీరో అథర్వా

అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో పాటు కీలక పాత్రలో నటించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం జూలై 10న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ చాలా అద్భుతం. నా గత చిత్రాలకు ఎంతో ప్రేమను అందించారు. ‘హృదయం మురళి’ స్పెషల్ సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో నటించిన వారందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఇది. దర్శకుడు ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తమన్ గారు ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఒక మంచి పాత్రలో కూడా నటించారు. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం. ఫహాద్ ఫాజిల్ గారు కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. దర్శకుడిగా, నిర్మాతగా ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్ అందించారు. ఈ సినిమా అందరూ రిలేట్ అయ్యే సినిమా. వన్‌సైడ్ లవర్స్ ఈ సినిమాతో చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరగా ఉండే సినిమా ఇది. జూలై 10న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్లకు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను.

ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘హృదయం మురళి’ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదల అవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడండి. ఇది హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. రెండు గంటల పాటు మీకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో చాలా నాస్టాల్జిక్ మూమెంట్స్ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం.”

సెల్వన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘డ్యూడ్’ సినిమాలో నేను చేసిన పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మైత్రి మూవీ మేకర్స్‌తో మరోసారి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘హృదయం మురళి’ ప్రేమ, స్నేహం గురించి చెప్పే అద్భుతమైన సినిమా. తమన్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను.”

మైత్రి శశి మాట్లాడుతూ.. ఈ సినిమాను మేము డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. గతంలో వచ్చిన ‘హృదయం’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో, ‘హృదయం మురళి’ కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. కయాదుతో మేము గతంలో ‘డ్రాగన్’ సినిమా చేశాం. అది బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా విజయం సాధిస్తుంది. అలాగే తమన్ గారు సంగీతం అందించడంతో పాటు ఇందులో నటించడం కూడా ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. జూలై 10న ‘లెనిన్’ సినిమా కూడా విడుదల అవుతోంది. ఆ సినిమాతో పాటు ‘హృదయం మురళి’ కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నాం.

నటీనటులు: అథర్వా, ప్రీతి, కయాదు, ఫహాద్ ఫాజిల్, థమన్ ఎస్, నిహారిక, ద్రవిడ్, ఏంజెలిన్ , అంజు కురియన్, సుధాకర్, యశశ్రీ, జోనిత

సాంకేతిక నిపుణుల:
దర్శకత్వం – ఆకాష్ బాస్కరన్
సంగీతం – థమన్ ఎస్
DOP – మనోజ్ పరమహంస, CH సాయి
ఎడిటర్ – ప్రదీప్ ఇ రాఘవ
ప్రొడక్షన్ డిజైనర్ – ఎం.ఆర్.కార్తీక్ రాజ్ కుమార్
సాహిత్యం – వివేక్
కొరియోగ్రాఫర్ – అనూషా విశ్వనాథన్
PRO – వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.