గత కొన్ని రోజులగా డాన్సర్ అసోసియేషన్ వివాదం గురించి వింటూనే ఉన్నాము. కాగా నేడు ఈ…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం రీ-రిలీజ్

శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మాతగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం.
ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ . ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు, ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం మరోసారి థియేటర్స్ లో విడుదల కానుంది, పాప్ కార్న్ ప్రొడక్షన్స్ లో దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణుమొలకల నక్షత్ర నిర్మాతగా కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహా నిర్మాతగా ఖడ్గం చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

