Skip to content

‘శ్రీ శ్రీ’ నుంచి రిఫ్రెషింగ్ రొమాంటిక్ రైడ్‌ ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన అందుకోగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను మేకర్స్ విడుదల చేశారు.

రైల్వే స్టేషన్‌లో బెంచ్‌పై కూర్చున్న దుల్కర్ సల్మాన్, ప్లాట్‌ఫామ్‌పైకి పూజా హెగ్డే అడుగుపెట్టిన క్షణమే ఆమెకు మెస్మరైజ్ అవుతాడు . అక్కడి నుంచి ఇద్దరి అందమైన ప్రేమ ప్రయాణాన్ని, ఆనంద క్షణాలను, వారితో పాటు ఉండే ఓ బృందాన్ని ఈ పాటలో అందంగా చూపించారు.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి మనసును హత్తుకునే మధురమైన మెలోడీని అందించారు. ఆహ్లాదకరమైన ట్యూన్, అందమైన ఆర్కెస్ట్రేషన్‌తో ఈ పాట ఆకట్టుకుంటుంది. అనంత శ్రీరామ్ తన సాహిత్యంతో ప్రేమలో మునిగిపోయిన ఓ యువకుడి భావాలను కవితాత్మకంగా ఆవిష్కరిస్తూ, కథానాయిక అందం, ఆమె ప్రత్యేకతను ఎంతో అందంగా వర్ణించారు. కపిల్ కపిలన్ తన మెలోడీ వోకల్ తో పాటకు మరింత అందం తీసుకురాగా, రామ్ మాస్టర్ అందించిన కోరియోగ్రఫీ విజువల్‌గా పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, అందమైన అనుబంధం ప్రతి ఫ్రేమ్‌ను చూడముచ్చటగా మార్చాయి. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ రొమాంటిక్ ఫీల్‌ను మరింత ఎలివేట్ చేశాయి. క్యాచీ ట్యూన్, అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌తో ఈ పాట మరో వైరల్ చార్ట్‌బస్టర్‌ కానుంది.

ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రవి నెలకుదిటి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్.ఎల్.వి. సినిమాస్
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సీఈఓ: విజయ్ కుమార్ చాగంటి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీఓపీ: అనయ్ ఓం గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్ఓ: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.