సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్…
‘కొరియన్ కనకరాజు’లో చాలా మోడరన్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ రితిక నాయక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రితిక నాయక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
-కొరియా వెళ్ళడం నన్ను మొదట ఆకట్టుకుంది. (నవ్వుతూ) ఎందుకంటే నాకు కొరియన్ కల్చర్, అక్కడి సినిమాలు, కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ఇందులో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఇది కేవలం కమర్షియల్ పాత్ర మాత్రమే కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఈ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు.
కథల ఎంపిక విషయంలో మీరు చాలా సెలెక్టివ్‌గా ఉంటారా?
-అవును. నాకు చాలా ఓపిక ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎంతకాలమైనా ఎదురుచూడగలను. ఒక పాత్రకు నేను 100 శాతం న్యాయం చేయగలనని అనిపిస్తేనే అంగీకరిస్తాను. ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేయడంపైనే నా దృష్టి ఉంటుంది.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
-ఈ సినిమాలో నేను సెల్ఫ్ ఇండిపెండెంట్, చాలా మోడరన్ అమ్మాయిగా కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నింటికంటే ఇది చాలా మోడరన్ క్యారెక్టర్.
వరుణ్ తేజ్ గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
-వరుణ్ తేజ్ గారు చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. తన వృత్తి పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఇటీవల కొన్ని ప్యాచ్‌వర్క్ షూట్స్ చేశాం. ఆయనకు గాయం ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు షూటింగ్ చేశారు. అది ఆయన డెడికేషన్‌కు నిదర్శనం. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
హారర్ కామెడీ జోనర్‌లో ‘కొరియన్ కనకరాజు’ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోంది?
-ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హారర్ కామెడీలు చాలా వచ్చినప్పటికీ, ఇందులోని కథ, ఇండియన్-కొరియన్ కల్చర్స్ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.
-ఇది చాలా మంచి కామెడీ ఎంటర్‌టైనర్. -ఈ సినిమాలో సత్య గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆయన కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. కామెడీ టైమింగ్ విషయంలో ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే వీటీవీ గణేష్ గారు, బుల్లిరాజు గారు ఇలా చాలామంచి హాస్యనటులు ఇందులో ఉన్నారు. ప్రేక్షకులు థియేటర్‌లో కడుపుబ్బా నవ్వుకునే సినిమా అవుతుంది.
షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి?
-అనంతపురంలో కొంత భాగం షూటింగ్ చేశాం. అలాగే కజకిస్థాన్, కొరియాలో షూటింగ్ చేశాం. మొత్తం షూటింగ్ జర్నీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిచిపోయింది.
యూవీ క్రియేషన్స్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
-యూవీ క్రియేషన్స్‌తో పనిచేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. షూటింగ్ సమయంలో ఒకసారి నేను అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలో నిర్మాతలు నా గురించి ఎంతో కేర్ తీసుకున్నారు. యూనిట్‌లో అందరూ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు.
ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నారా?
-మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. అవకాశం వస్తే తప్పకుండా అన్ని భాషల్లో పనిచేయాలని ఉంది. కానీ తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే ఇది నా మదర్ ఇండస్ట్రీ. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, మిరాయ్, ‘హాయ్ నాన్న’ నేను చేసిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు.
తమన్ గారి మ్యూజిక్ గురించి?
-తమన్ గారు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో నేను తొలిసారి డ్యాన్స్ కూడా చేశాను. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
-మంచి కథ, పాత్రకు ప్రాధాన్యం ఉన్న అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది.
‘కొరియన్ కనకరాజు’ సినిమా చూశారు కదా… ఎలా అనిపించింది?
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చూస్తున్నంతసేపూ నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎంటర్‌టైన్ అవుతారని నమ్ముతున్నాను.
‘మిరాయ్ 2’ గురించి చెప్పండి?
-ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దాని గురించి చెప్పడానికి ఇంకా సమయం ఉంది.
మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి?
-ప్రస్తుతం ఒక తెలుగు ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దాని గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.

