Skip to content

రెండు రోజుల్లోనే 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘లెనిన్‌’ సెన్సేష‌న్

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్స్‌లో అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ఈ సినిమా జీ5తో ప్ర‌తి ఇంటిలో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది.

లెనిన్ సినిమా థియేట‌ర్స్‌లోనే కాదు.. జీ5లో స్ట్రీమింగ్‌లోనూ స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుండ‌టం విశేషం. రెండు రోజుల్లోనే లెనిన్ సినిమా 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఎంతలా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌నే దానికి ఇప్పుడు జీ5లో ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఓ సాక్ష్యంగా పేర్కొన‌వ‌చ్చు. ఇదే ఊపులో ఈ చిత్రం ఓటీటీలో మ‌రిన్ని సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు జిల్లాలోని రామ‌చంద్ర‌పురం గ్రామంలో జ‌రిగే ద్రౌప‌ద‌మ్మ తిరునాళ్లు నేప‌థ్యంలో లెనిన్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. కోపం, ద్వేషం, ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే ఓ స్నేహితుడు త‌న ప్రాణ స్నేహితుడైన లెనిన్‌కు చేసే ద్రోహం ఎలాంటిది? దాని వ‌ల్ల లెనిన్ ఏం కోల్పోయాడు? అస‌లు లెనిన్ జైలుకు ఎందుకెళ్లాడు? రామ‌చంద్ర‌పురంలో జ‌రిగిన కురుక్షేత్రంలో ఎవ‌రు విజ‌యం సాధించారు? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న లెనిన్ సినిమా చూడాల్సిందే.

రా అండ్ ర‌స్టిక్ పాత్ర‌లో అఖిల్ పెర్ఫామెన్స్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. భాగ్య‌శ్రీ బోర్సె గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌తో మెప్పించింది. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మేకింగ్ వేల్యూస్‌.. డైరెక్ట‌ర్ ముర‌ళి కిషోర్ అబ్బూరు క‌థ‌, క‌థ‌నం, టేకింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ సినిమాకు తమన్ ఇచ్చిన సంగీతం, నేపథ్యం సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. లియోన్ బ్రిట్టో కెమెరావర్క్, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాని నిలబెట్టాయి.

జీ5 గురించి…
భారతదేశపు అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా, లక్షలాది వినోద ప్రియులకు హాట్ ఫేవరేట్‌గా జీ5 దూసుకుపోతోంది. జీ5 గ్లోబల్ కంటెంట్ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) సంస్థ నుండి వచ్చింది. వినియోగదారులకు తిరుగులేని వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫామ్‌గా ఇది 4,071కి పైగా సినిమాలు, 1,800కి పైగా టీవీ షోలు, 422కి పైగా వెబ్ ఒరిజినల్స్, 4,492కి పైగా మ్యూజిక్ వీడియోలు, 1.35 లక్షల గంటలకు పైగా ఆన్-డిమాండ్ కంటెంట్‌తో కూడిన విస్తృతమైన, విభిన్నమైన ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది. విస్తరించి ఉన్న 7 పర్సనలైజ్డ్, హైపర్-లోకల్ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లతో ఈ కంటెంట్ ఇప్పుడు మా విభిన్న ప్రేక్షకులకు 12 భాషలలో – హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీలో అందుబాటులో ఉంది.

ఓరిజినల్స్, భారతీయ, అంతర్జాతీయ సినిమాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్, పిల్లల కంటెంట్, న్యూస్, లైవ్ టీవీ, మైక్రో డ్రామాలు వంటి విభిన్న కంటెంట్‌తో విస్తారమైన లైబ్రరీ కలిగిన జీ5, భారతీయ ప్రేక్షకులకు బహుభాషా వినోదం, లైవ్ స్పోర్ట్స్ అనుభవాన్ని అందించే ప్రధాన ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. అలాగే, జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు FIFAతో 2034 వరకు ఉన్న దీర్ఘకాల భాగస్వామ్యం వల్ల, భారత్‌లో FIFAకి సంబంధించిన ప్రముఖ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో వీక్షించవచ్చు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.