Skip to content

7 రాష్ట్రాల్లో 400కు పైగా హెచ్ పీవీ అవేర్ నెస్ కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలిచిన AAFA

సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 400లకు పైగా అవగాహన కార్యక్రమాలకు మద్ధతుగా నిలిచింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. తాజాగా ఈ కార్యక్రమాల ద్వారా లక్ష మంది యువతులకు చేరువైంది.

సామాజిక బాధ్యత గల అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించారు. హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడంలో బాలికలకు, యువతులకు ఆరోగ్యకరమైన భవితను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.