Skip to content

‘మండాడి’ నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ సాంగ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. మైత్రి మూవీస్ ఆల్రెడీ తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచింది. సూరి, సుహాస్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సోల్ ఫుల్, మెలోడీ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు.

‘తెలుసా నీకే పిల్లా’ అంటూ సాగే ఈ ఫీల్ గుడ్ సాంగ్‌ను కాసర్ల శ్యాం రచించగా.. కృష్ణ తేజస్వీ, రేష్మ శ్యాం ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బాణీ మనసుల్ని హత్తుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే సినిమాలో సూరి, మహిమా నంబియార్ లవ్ ట్రాక్‌ను గొప్పగా చూపించబోతోన్నట్టుగా అర్థం అవుతోంది.

‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.

ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు.

నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మదిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.