రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ (BTS) గ్లింప్స్‌ను…
“రణబాలి” ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ విడుదల
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“రణబాలి” నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో రూపొందించిన 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ ఈ రోజు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో 1876 – 78 మధ్య కాలంలో బ్రిటీషర్స్ సృష్టించిన కరువు కోటి మంది భారతీయుల ప్రాణాలు తీసిన విషాధ ఘటనను వెల్లడించారు. భారతీయులు ఆకలితో చనిపోతుంటే, బ్రిటీషర్లు తమ దేశానికి టన్నుల కొద్దీ ధాన్యం ఎలా తరలించారో చూపించారు. 150 ఏళ్ల ఈ చరిత్రను రీసెర్చ్ చేసి ఈ సినిమాగా రూపొందించారు. ఈ భారీ ప్రయత్నాన్ని హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెలిపారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ – మేము బ్రిటీషర్స్, వారి సామ్రాజ్య చరిత్ర గురించి వందలాది చిత్రాల చూశాం. ఎక్కడా కరువు గురించి వాళ్లు పేర్కొనలేదు. హిస్టరీలో 1976 – 78 మధ్య కాలంలో ది గ్రేట్ మద్రాస్ కరువు ఏర్పడింది అని ఉంది. ఈ రెండేళ్ల కాలంలో కరువు కారణంగా కోటి మంది భారతీయులు చనిపోయారు. ఆ కాలంలో భారతీయుల మొత్తం జనాభా 25-30 కోట్లుగా ఉండేది. వారిలో కోటి మంది చనిపోవడం అంటే ఎంత విషాధమో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు లోతైన పరిశోధన చేశాం. కలెక్టర్ ఆఫీస్ లకు, లైబ్రరీలకు, పాత లైబ్రరీలకు వెళ్లి ఎన్నో పుస్తకాలను, గెజిట్ లను పరిశీలించాం. అన్నారు
హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – ఈ కరువు ఘటన గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. వారు చేసిన త్యాగాలను, పడిన బాధను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకున్నాను. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఈ కరువు కాలంలో మన భారతీయులు ఆకలితో చనిపోతుంటే, మరోవైపు బ్రిటీషర్స్ లక్షలాది టన్నుల ధాన్యం బ్రిటన్ కు, వారు యుద్ధాలు చేస్తున్న ప్రాంతాలకు తరలించేవారు. 150 ఏళ్ల క్రితం ఈ ఘోర ఘటన జరిగింది. ఆకలితో అలమటిస్తూనే బ్రిటీషర్స్ కోసం ప్రజలు ధాన్యం మోసేవారు. ఇది ఒకప్పుడు నిజంగా జరిగిందనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక మంచి స్టోరీని తెరకెక్కించాం. ఆ కరువు కాలంలో అమరులైన ప్రజలకు నివాళిగా ఈ మూవీని రూపొందించాం. అన్నారు.
ఈ నెల 30న సెకండ్ ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’, అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.



