Skip to content

“రణబాలి” ‘ది మెన్ వి ఫర్ గాట్’ విడుదల

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“రణబాలి” నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో రూపొందించిన 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో థర్డ్ ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ ఈ రోజు యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమ మాతృభూమి కోసం పోరాడిన కొందరు రాయలసీమ చారిత్రక వీరుల స్ఫూర్తితో రణబాలి పాత్రను క్రియేట్ చేసినట్లు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ ఎపిసోడ్ లో తెలిపారు.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ – ఎందరో వీరులను కన్న గడ్డ రాయలసీమ. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి వంటి సీమ పాలెగాళ్ల వీరగాథలు ఇప్పటికీ బుర్రకథలుగా చెప్పుకుంటారు. రాయలసీమ గ్రామాలకు వెళ్తే అక్కడి ప్రజలు వీరి గొప్పదనం గురించి మాట్లాడుతుంటారు. గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి గురించి విన్నప్పుడు నాకు ఈ కథ ఆలోచన కలిగింది. ఆయన గుర్రం స్వారీ చేస్తూ వెళ్లేవారు. దేవుళ్లతోనూ మాట్లాడుతారని ప్రతీతి. అనంతరం కుట్రలు చేసి ఆయనను హత్య చేశారు. అప్పటి కరువు కాలం గురించి పరిశోధన చేస్తున్నప్పుడు బుడ్డా వెంగళరెడ్డి గురించి తెలుసుకున్నాను. కరువు కాలంలో ఆయన తన ఆస్తులన్నీ అమ్మి గంజి కేంద్రాలను ఏర్పాటు చేసిన వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వారికి సింహస్వప్నంలా నిలిచారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నేను రాయలసీమ గడ్డ నుంచి వచ్చినవాడినే. ప్రజలకు మంచి చేసేందుకు ఇలా ధీరత్వం ప్రదర్శించే ఎంతోమందిని నా చిన్నతనంలో చూశాను. ఈ వీరులంతా మంచి శరీర ధారుడ్యంతో ధైర్య సాహసాలు ప్రదర్శించేవారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని రణబాలి పాత్రను డిజైన్ చేసుకున్నాను. అన్నారు.

నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.