Skip to content

‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’

‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’ Telugu News
‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’ Telugu News

హైదరాబాద్: భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన బిగ్గెస్ట్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’(MTV Splitsvilla) సరికొత్త ట్విస్టులతో, మరింత బోల్డ్‌గా మరియు స్పైసీగా మన ముందుకువచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక షో 16వ సీజన్‌ను ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్యా పైసా’ (MTV Splitsvilla X6: Pyaar ya Paisa) పేరుతో ఘనంగా ప్రారంభించింది. ఈ సీజన్ప్రత్యేకత ఏంటంటే, చరిత్రలోనే మొదటిసారిగా ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.మే 12 నుండి ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు ‘జియోహాట్‌స్టార్’(JioHotstar) మరియు ఎమ్‌టీవీ ఛానల్‌లో ప్రసారమవుతోంది.

సరికొత్త ట్విస్ట్.. ‘ప్యార్ విల్లా’వర్సెస్ ‘పైసా విల్లా’:  తమిళనాడులోనిఅందమైన మహాబలిపురం తీర ప్రాంతంలో ఈ సీజన్ షూటింగ్ జరుపుకుంది. ఈసారి షోలో పాల్గొనేందుకు33 మంది హాట్ అండ్ సింగిల్ యువతీ యువకులు ఎంపికయ్యారు. గత సీజన్ ముగింపులో కంటెస్టెంట్లుదిగ్విజయ్, కాశిష్ వదిలివెళ్లిన ఉత్కంఠభరితమైన మలుపు ఆధారంగా ఈ కొత్త సీజన్ రూపుదిద్దుకుంది.ఇందులో కంటెస్టెంట్లను ‘ప్యార్ విల్లా’ (ప్రేమ విల్లా) మరియు ‘పైసా విల్లా’ (డబ్బువిల్లా) అనే రెండు విభాగాలుగా విభజించారు. ప్రేమ మరియు డబ్బు మధ్య జరిగే ఈ ఆసక్తికరమైనపోరాటంలో ఎవరు గెలుస్తారు? ఎవరు తమకు జోడీని వెతుక్కుంటారు? అనేది ఈ సీజన్ ముఖ్య కథాంశం.

స్టార్ హోస్ట్‌లు మరియు మిస్చిఫ్మేకర్స్:  ఈభారీ రియాలిటీ షోకు ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ సన్నీ లియోన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ షోతో ఆమెకు పదేళ్ల సుదీర్ఘమైన మరియు విజయవంతమైన అనుబంధం ఉంది. ఈసారి ఆమెతో పాటు‘కింగ్ ఆఫ్ హార్ట్స్’ కరణ్ కుంద్రా కో-హోస్ట్‌గా జోడై షోలో సరికొత్త జోష్ నింపారు.వీరికి తోడుగా షోలో డ్రామా, గందరగోళం మరియు ట్విస్టులను పెంచడానికి ‘మిస్చిఫ్ మేకర్స్’గాపాపులర్ సెలబ్రిటీలు నియా శర్మ, ఉర్ఫీ జంటగా రంగంలోకి దిగారు.

ఈ సందర్భంగా హోస్ట్సన్నీ లియోన్ మాట్లాడుతూ:  “స్ప్లిట్స్‌విల్లాఎల్లప్పుడూ నా హృదయానికి చాలా దగ్గరైన షో. ప్రస్తుత తరం యువతలో ప్రేమ, బంధాలు మరియువారు తీసుకునే నిర్ణయాలు కాలానికి అనుగుణంగా ఎలా మారుతున్నాయో ఈ షో ప్రతిబింబిస్తుంది.ఈ సీజన్‌లో తీసుకొచ్చిన ‘ప్యార్ యా పైసా’ (ప్రేమ లేదా డబ్బు) అనే ట్విస్ట్ కంటెస్టెంట్లభావోద్వేగాలకు, బంధాలకు పెద్ద పరీక్షగా నిలవబోతోంది. ఎన్నో ఊహించని సర్ప్రైజ్‌లతో రాబోతున్నఈ సరికొత్త డ్రామాను వీక్షించడానికి అభిమానులు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను.”