Skip to content

సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి Telugu News
సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి Telugu News

మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా A సర్టిఫికెట్ ఇచ్చారు – ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని

-సరైన సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్లే “దీవాన” ప్రీమియర్స్ వేయలేకపోయాం- హీరో హర్షిత్ రెడ్డి

యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “దీవాన” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు నర్సింగ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నీలాంటి ఫ్రెండ్ ఉండాలని ఆడియెన్స్ అంటున్నారు. మా సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీస్ వెళ్లి చూడలేకపోతున్నారు. మంచి ఫాదర్, సన్ ఎమోషన్ ఉన్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు. బ్యూటిఫుల్ ఎమోషన్స్ తప్ప మా మూవీలో ఎలాంటి ఇబ్బందికర సన్నివేశాలు లేవు. మీరు సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అన్నారు.

నటుడు టోనీ మాట్లాడుతూ – ఏ ఎమోషన్ చూసి ఏ సీన్ చూసి ఏ సర్టిఫికెట్ మా మూవీకి ఇచ్చారో అర్థం కావడం లేదు. సినిమాకు వెళ్లాలనుకుని టికెట్ బుక్ చేస్తున్న వారికి 18 ఫ్లస్ అని చూపిస్తుందని మా ఫ్రెండ్స్ అంటున్నారు. మేము ఎంత గొప్ప సినిమా చేశామో మీడియా వాళ్లే చెప్పారు. మాలాంటి కొత్తవాళ్లం ఈ వేదిక దాకా రావడమే పెద్ద విషయం. మా సినిమా థియేటర్స్ లో చూస్తూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మాది రివేంజ్ మూవీ కాదు ర్యాంపేజ్ మూవీ. ఈ సినిమాలో నేను చేసిన సాయి పాత్రకు మంచి గుర్తింపు దక్కుతోంది. అన్నారు.

నటుడు కె కె మాట్లాడుతూ – ఈ సినిమా మా టీమ్ మూడేళ్ల కష్టం. పైరసీలో మాత్రం చూడకండి. సినిమా చాలా బాగుందని టాక్ వస్తోంది. బాగా రాశారు. బాగా పర్ ఫార్మ్ చేశారని అంటున్నారు. మీరు థియేటర్స్ కు వెళ్లి చూసి సపోర్ట్ చేయండి. ఇండియా క్రికెట్ టీమ్ కు ధోనీలా మా టీమ్ కు మా శ్రీకాంత్ అన్న కెప్టెన్ లా ముందుండి నడిపించారు. అన్నారు.

నటి సింధు మాట్లాడుతూ – మూడేళ్ల క్రితం స్క్రిప్ట్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఏం చెప్పారో అంతే బ్యూటిఫుల్ గా సినిమా తీశారు. ఏ థియేటర్ కు వెళ్లినా బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఫాదర్, సన్ రిలేషన్ ను హార్ట్ టచింగ్ గా చూపించారు. సినిమా చూస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎమోషన్ అయ్యారు. ఇలాంటి మంచి సినిమాను ప్రేక్షకులు మరింతగా ఆదరించాలి. అన్నారు.

ఫైట్ మాస్టర్ హరి మాట్లాడుతూ – ఈ సినిమాలో వర్క్ చేశాక హర్షిత్ యాక్షన్ హీరో అయిపోవచ్చు అనిపించింది. అంత నేచురల్ గా ఫైట్స్ చేశాడు. నేను నా ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాను. చాలా బాగుంది. టోనీ క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండిపోతుంది. హర్షిత్ చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు. అన్నారు.

నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. ప్రేమను, స్నేహాన్ని అందంగా చూపించారు. దీవాన మూవీ చూస్తున్నంత సేపు మీరు ఫోన్ కూడా ముట్టుకోరు. అంతగా మూవీలో లీనమవుతారు. ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ – దీవాన సినిమా మా ఇరవై ఏళ్ల కల. ఈ రోజు సినిమా చూసి ఎప్పుడో కలిసిన పాత ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ చేసి మాట్లాడుతున్నారు. అయితే సెన్సార్ వాళ్లు మాలాంటి చిత్రాలకు సరైన సర్టిఫికేషన్ ఇవ్వకుండా మా కలల్ని తుంచేస్తున్నారు. సెన్సార్ నుంచి ఇలాంటి సర్టిఫికేషన్స్ వస్తే కొత్తగా కథ చెప్పాలనుకునే దర్శక నిర్మాతలు ఎలా ఇండస్ట్రీకి వస్తారు. సినిమాలో ఇబ్బందికరంగా ఉంటే ఏ సర్టిఫికెట్ ఇవ్వండి తప్పులేదు. కానీ మా డైరెక్టర్ లవ్ స్టోరీ కాదు స్టోరీ ఆఫ్ లవ్ చెప్పాడు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ స్టోరీ కాదు బతికేందుకు ఎలాంటి ప్రేమ ఉండాలో చూపించాడు. మా దృష్టిలో మాత్రం ఏ సర్టిఫికెట్ అంటే మాది అద్భుతమైన సినిమా, ఆగపోని సినిమా, ఆస్వాదించాల్సిన సినిమా అనుకుంటున్నాం. అన్నారు.

నటి ఝాన్సీ మాట్లాడుతూ – దీవాన సినిమాకు ప్రతి థియేటర్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నేను థియేటర్ లో సినిమా చూశాను. గొప్ప ఫీలింగ్ కలిగింది. మేమొక అద్భుతమైన సినిమా చేశామని చెప్పగలను. కథనంతో ఈ సినిమాను గొప్పగా నడిపించారు డైరెక్టర్ శ్రీకాంత్. ఈ సినిమాలో మదర్ రోల్ అంటే ఏదో చేసేద్దాం అనుకున్నా కానీ సెట్స్ లోకి వెళ్లాక డైరెక్టర్ శ్రీకాంత్ ఈ మూవీని, ఇందులోని క్యారెక్టర్స్ ను ఎంత డెప్త్ గా రాసుకున్నాడో అర్థమైంది. ఈ సినిమాకు శ్రీకాంత్ రాసిన డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయి. మనం బయట ఎలా మాట్లాడుకుంటామో అంత నాచురల్ గా డైలాగ్స్ రాశారు. హర్షిత్ చేసిన మున్నా క్యారెక్టర్ కు యూత్ ఆడియెన్స్ అంతా బాగా కనెక్ట్ అవుతారు. అన్నారు.

ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – ఈ రోజు నాలో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కలుగుతున్నాయి. మంచి సినిమా చేశారంటూ అప్రిషియేషన్స్ తో ఫోన్ కాల్స్ ఆగడం లేదు. మరోవైపు మా సినిమాను ఇంకాస్త ఆడియెన్స్ లోకి తీసుకెళ్తే బాగుండేది అని అనిపిస్తోంది. మేము రిలీజ్ ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్స్ ప్లాన్ చేశాం అయితే ఈ సర్టిఫికేషన్ వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మాలాంటి యంగ్ టీమ్ కు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మీకు మా మూవీ నచ్చకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ప్రైజ్ 100 రూపాయలు చేస్తున్నాం. మల్టీప్లెక్స్ ల్లో కూడా ఒక రేట్ ప్రకటిస్తాం. ప్రేక్షకులందరి దగ్గరకు వచ్చి మా సినిమాను మరోసారి రీచ్ చేయాలని అనుకుంటున్నాం. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ – మా మూవీ ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. భ్రమరాంభ థియేటర్ పక్కనే మా ఇళ్లు. అక్కడ మా మూవీ షో జరుగుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఇంటికి వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాకు అలాంటి రెస్పాన్స్ వస్తుంటుంది. ఆ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే మా మూవీ టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకుంటున్న వారికి 18 ఫ్లస్ అని చూపిస్తోంది. అది చూసి వాళ్లు ఏముందో అని భయపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లగా చెబుతున్నా. నాకు ఫ్యామిలీ ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో ధైర్యంగా చూసే సినిమా మేము చేశామని గర్వంగా చెప్పగలను. మీడియా మిత్రులు సినిమా చూశారు కాబట్టి మీరే చెప్పాలి మా సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైనవి ఉన్నాయా లేదా అని. మీరు థియేటర్స్ కు వచ్చి చూడండి అస్సలు డిజప్పాయింట్ అవరు. అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమా ఆగదు. శతదినోత్సవం దాకా వెళ్తుంది. మన ప్రేక్షకులు మంచి చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండూ ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్ కు కూడా వస్తోంది. థియేటర్ కు వెళ్తే హర్షిత్ ను ఆడియెన్స్ చుట్టిముడుతున్నారు. అలాంటి ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు. నెక్ట్స్ టెన్ ఇయర్స్ లో కూడా రాదు. అన్నారు.

హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ – మేమొక గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమా చూస్తే లవ్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటి యూత్ లవ్ లో పడతారు. మేము ఒక రియల్ లైఫ్ ను సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజ్ లు పంపుతున్నారు. ఒక అబ్బాయి మా మూవీ చూసి వాళ్ల ఫాదర్ దగ్గరకు వెళ్లి ఎమోషనల్ గా మాట్లాడాడట. నేను భ్రమరాంభ థియేటర్ లో మూవీ చూసి బయటకు వచ్చాక అందరూ చుట్టుముడుతున్నారు. ఇలాంటి లవ్ అండ్ రిసెప్షన్ మా మూవీకి వస్తోంది. దీవాన ఒక టైమ్ లెస్ లవ్ స్టోరీ. మీరు ఎప్పుడూ చూసినా నచ్చుతుంది. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. మీ పేరెంట్స్ తో మీరు ఎలా ఉండేవారు అనేది గుర్తొస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. మేము అరవింద్ గారు చెప్పిన సూచన మీద చాలా చోట్ల ప్రీమియర్స్ వేసి మార్నింగ్ షోకు ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలని అనుకున్నాం. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. ఇది యూ బై ఏ సినిమా. థియేటర్స్ కు వస్తే అమేజింగ్ ఎక్సిపీరియన్స్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలే టికెట్. మా సినిమాను సింగిల్ స్క్రీన్స్ లో చూస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇలాంటి పర్ ఫార్మెన్స్ నేను చేయగలను అనుకోలేదు. నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. అన్నారు.

నటీనటులు – హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు

టెక్నికల్ టీమ్
—————-
కాస్ట్యూమ్స్ – మానస
ప్రొడక్షన్ డిజైనర్ – ఝాన్సీ గోజల
ఎడిటర్ – హృషికేశ్ పాస్పల్
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ – ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ – హౌస్ ఫుల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ – శ్రీకాంత్ సంగిశెట్టి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.