Skip to content

గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో ‘రిమ్‌జిమ్’ మూవీ

▪️‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా
▪️ నిజ సంఘటనల ఆధారంగా ‘రిమ్‌జిమ్’
▪️ న‌టించి పాట‌లు పాడిన‌ రాహుల్ సిప్లిగంజ్
▪️ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు

1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ ద‌ర్శ‌క‌త్వంలో, సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందుతోంది. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు.

AV సినిమాస్ , సి విజువల్స్ బ్యానర్ల పై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం హేమ సుందర్. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించగా, ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రధాన పాత్రలో అజయ్ వేద్, హీరోయిన్‌గా వ్రజన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కనిపించనున్నారు.

సాంకేతిక విభాగంలో సంగీతం కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ వాసు పెండం, ఎడిటింగ్ పెనుమత్స రోహిత్ నిర్వహిస్తున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ‘గ్యాంగ్‌స్టర్’ ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది.

బ్యానర్‌: AV సినిమాస్ , సి విజువల్స్
న‌టీన‌టులు: అజయ్ వేద్, వ్రజన, రాహుల్ సిప్లిగంజ్, బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ త‌దిత‌రులు.

నిర్మాత‌లు: జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హేమ సుందర్
పాట‌లు: రాహుల్ సిప్లిగంజ్
సంగీతం: కొక్కిలగడ్డ ఇఫ్రాయిం
సినిమాటోగ్రఫీ: వాసు పెండం
ఎడిటింగ్: పెనుమత్స రోహిత్
పీఆర్ఓ: అశోక్ ద‌య్యాల‌