ఘనంగా ‘ఎపిక్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'సంచారమే' అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. 'ఎపిక్' టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. 90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న…
