ధనుష్ ‘కర’ తెలుగు టీజర్ విడుదల
‘పంటో.. గడ్డో పాపమో..పుణ్యమో తను నాటింది..తనే నరుక్కోవాలి నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి నా పేరు కరసామి’’ అని ఓ యువకుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు..... ఇంతకీ కరసామి మీద పడ్డ మచ్చ ఏంటి? అతను తనకు ఎదురైన సమస్యను ఎలా దాటి తనపై పడ్డ మచ్చను తుడుచుకున్నాడు.. అనేది తెలుసుకోవాలంటే వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్…
