రాజమహేంద్రవరంలో ‘భోగి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం
ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, 'భోగి' చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్ , బ్లాక్‌బస్టర్ చిత్రనిర్మాత సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మాణంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్-లుక్ విడుదలకు లభించిన అద్భుత స్పందన నేపథ్యంలో, చిత్ర బృందం ఇప్పుడు రాజమండ్రిలో అత్యంత కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. షూటింగ్ రాంపచోడవరం అడవులలోని కఠినమైన, సవాలుతో కూడిన ప్రదేశాలలో జరగనుంది. ఇక్కడ ఎక్సయిటింగ్, టఫ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు…
