తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జోడీగా కొత్త సినిమా ప్రారంభం
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ప్రీ వెడ్డింగ్ షో'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మిస్తున్నారు. తమ ఫస్ట్ ప్రొడక్షన్ శివమ్ భజేతో ప్రేక్షకులని అలరించిన గంగాఎంటర్‌టైన్‌మెంట్స్, మరో ఎక్సయిటింగ్ కథతో వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్, మసూద…
