నవంబర్ 7న ప్రేక్షకులను కలవనున్న ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్
సైన్స్ ఫిక్షన్ చరిత్రలో అత్యంత భయానకమైన పాత్రలలో ఒకటైన ‘ప్రెడేటర్’ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది. ఇప్పుడు అదే సిరీస్‌కి కొత్త రూపాన్ని ఇస్తూ, “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” నవంబర్ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈసారి కథలో మలుపు ఏమిటంటే — వేటగాడే వేటలో చిక్కుకుపోతాడు. 1987లో ప్రారంభమైన లెజెండ్ అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రధాన పాత్రలో వచ్చిన తొలి “ప్రెడేటర్” చిత్రం, అమెజాన్ అడవుల్లో కమాండోలు ఎదుర్కొన్న కంటికి కనిపించని భయానక మృగం కథతో ప్రేక్షకులను కుదిపేసింది. 1990లో…
