రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు' నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయం యూఎస్‌లో హ్యాట్రిక్ $1 మిలియన్.. $2 మిలియన్ దిశగా పరుగులు మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, తాజా సంచలన విజయం 'అనగనగా ఒక రాజు'తో మరో స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ సంక్రాంతి పండుగను మరింత వైభవంగా మార్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టిన…
