‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది: సమంత
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో.. సమంత మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ…
