విష్ణు విన్యాసం’ రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు: శ్రీ విష్ణు
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీరు గ్రహాలని, జాతకాలని నమ్ముతారా? -అన్ని ఫాలో అవ్వను, కానీ మనం చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని ఫాలో అవుతాను. పర్సనల్ గా నాకైతే ఫలానా టైము ఫలానా నెంబర్లు…
