Skip to content

ఇకనుంచి “నటన” పార్ట్ టైమ్ కాదు ఫుల్ టైమ్!

-“కాకినాడ కళారత్నం” రవి ఆనంద్ చిన్నిబిల్లి

పారితోషికం కంటే పాత్రకు- పాత్ర నిడివి కంటే…. పాత్ర ప్రభావానికి ప్రాధాన్యత!!

రేలంగి, అంజలీదేవి, సూర్యకాంతం, రావు గోపాలరావు వంటి సాటిలేని మేటి నటీనటుల్ని తెలుగు చిత్ర రంగానికి అందించిన “కాకినాడ” మరో ప్రతిభావంతుడ్ని అందించేందుకు సిద్ధమవుతోంది. నటుడిగా ప్రతిష్టాత్మక “పద్మశ్రీ” పురస్కారాన్ని…. “నటకిరీటి” అన్న ప్రజా పురస్కారాన్ని సొంతం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ వంటి గొప్ప నటుడితో “శభాష్” అనిపించుకున్న ఆ ప్రతిభాశాలి పేరు “రవి ఆనంద్ చిన్నిబిల్లి”.

థియేటర్ ఆర్టిస్ట్ గా ఎనలేని పేరు గడించుకొని… కుటుంబ బాధ్యతలు దృష్ట్యా ఇప్పటివరకు కాకినాడకే పరిమితమై, అడపా దడపా మాత్రమే సినిమాల్లో మెరుస్తున్న రవి ఆనంద్… ఇకపై పూర్తిస్థాయిలో సినిమా రంగంపై దృష్టి సారించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పిల్లలు విద్యాపర్వం పూర్తి చేసుకుని ఉద్యోగపర్వంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో… ఇప్పటివరకు ఒక హాబీగా, పార్ట్ టైం గా ఉన్న నటనను ఇకపై ఫుల్ టైమ్ గా చేసుకొని “ప్రొఫెషనల్ ఆర్టిస్టు”గా సెటిల్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే కాకినాడ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చుకోనున్నారు!!

“శివకాశిపురం”తో సినిమాల్లోకి శ్రీకారం చుట్టిన రవి ఆనంద్…. ఇప్పటివరకు “సైరా నరసింహారెడ్డి, నారప్ప ,మహానటి,
డియర్ కామ్రేడ్, అన్నదాత సుఖీభవ, బెదురులంక-2012, అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, నీతోనే హాయి హాయి, బచ్చల మల్లి, మజాకా, ఫుల్ బాటిల్, దేవగుడి” మరియు “చదరంగం” (వెబ్ సిరీస్) వంటి చిత్రాల్లో…. రాజేంద్రప్రసాద్, రావు రమేష్ వంటి దిగ్గజాల కాంబినేషన్లో నటించి మెప్పించారు!!

భవిష్యత్తులో తన అభిరుచి మేరకు సినిమాలు తీసేందుకు… “సాయంకాలం సిత్రాలు” పేరుతో ఒక నిర్మాణ సంస్థను సైతం నెలకొల్పిన రవి ఆనంద్ చిన్నిబిల్లి…. రఘు కుంచె టైటిల్ పాత్ర పోషించిన “గేదెల రాజు” చిత్ర నిర్మాణంలో సహ నిర్మాతగా పాలుపంచుకోవడంతోపాటు అందులో “శివయ్య” అనే ఓ కీలక పాత్రలో తనదైన శైలిలో చెలరేగిపోయి అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నారు. కాకినాడకే చెందిన చైతన్య మోటూరి నిర్మాణం – దర్శకత్వంలో తెరకెక్కి, ఏప్రిల్ 24 న…. 284 విడుదలై, థియేటర్లలో విశేషంగా అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం “ఆహా – అమెజాన్”లలో ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం!!

గత 15 ఏళ్లుగా “కాకినాడ ఫర్నిచర్ షాప్స్ అసోసియేషన్” అధ్యక్షుడిగా సేవలందిస్తున్న రవి ఆనంద్… 116 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన YMHC (ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ) ప్రధాన కార్యదర్శిగా కాకినాడ కళా రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నగర ప్రముఖుల్లో ఒకరిగా మన్ననలందుకుంటున్నారు!. ఒక నటుడిగా తెరపైనా… ఒక వ్యక్తిగా జీవితంలోనూ “చాంపియన్” అయిన రవి ఆనంద్… వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కూడా కావడం చెప్పుకోదగ్గ విశేషం!!
ఎస్వీ రంగారావును తన రోల్ మోడల్ గా భావించే రవి ఆనంద్ ప్రస్తుతం భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్ ఫేమ్) దర్శకత్వంలో…. కిరణ్ అబ్బవరం, తిరువీర్ నటిస్తున్న “గువ్వల చెరువు గట్టు” అనే అమెజాన్ వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అలాగే రఘు కుంచె నటిస్తున్న “పయనం”లోనూ నటిస్తున్న రవి ఆనంద్…. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియాలు దద్దరిల్లిపోయేలా మెప్పించేంత మంచి థియేటర్ ఆర్టిస్టు మాత్రమే కాదు… “మిమిక్రి మరియు మైమ్ ఆర్టిస్ట్” కూడా. అందుకే తనకిచ్చిన పాత్రల్లో ఆయన అలవోకగా పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు!!

“పారితోషికం కంటే పాత్రకు… పాత్ర నిడివి కంటే పాత్ర తాలూకు ప్రభావానికి” నా ప్రాధాన్యత అంటున్న “రవి ఆనంద్ చిన్నిబిల్లి”ని 9848377695 నంబర్లో నేరుగా సంప్రదించవచ్చు!!

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.