మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ…
‘ది ప్యారడైజ్’ ‘ఆయా షేర్’ అరుదైన రికార్డ్.. 200 మిలియన్ వ్యూస్ దాటిన బ్లాక్‌బస్టర్ సాంగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘ఆయా షేర్’ ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటుతూ ఈ ఏడాది అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచింది.
విడుదలైనప్పటి నుంచి ‘ఆయా షేర్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా కొనసాగుతోంది. సోషల్ మీడియా యూజర్స్, కాలేజ్ స్టూడెంట్స్, చిన్నారులు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ పాట ఆకట్టుకుంది. క్యాచీ ట్యూన్, ఎనర్జిటిక్ కోరియోగ్రఫీ, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ఈ పాట సెలబ్రేషన్స్, పబ్లిక్ ఈవెంట్స్‌లో తప్పనిసరిగా వినిపించే సాంగ్‌గా మారింది.
అనిరుధ్ రవిచందర్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్‌కు కాసర్ల శ్యామ్ రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ ఎనర్జిటిక్ వోకల్స్ ఈ పాటను మరింత వైరల్ అయ్యేలా చేశాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో నానిని మరోసారి పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించారు. నాని ఫియర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ మేకోవర్, హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో పాటు సినీ అభిమానుల ప్రశంసలు అందుకుంటూ ఈ పాటను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిపాయి.
‘ఆయా షేర్’ ఇప్పటికే రికార్డులను తిరగరాస్తుండటంతో ‘ది ప్యారడైజ్’ 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదే సమయంలో ఈ ఆల్బమ్ నుంచి రానున్న నెక్స్ట్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

