‘బ్యాండ్ మేళం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను – శివాజీ
‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి తమన్, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. శివాజీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ మంచి లవ్ స్టోరితో తెరకెక్కింది. ఇందులో కూడా నన్ను ఓ పాత్ర చేయమని అడిగారు. కానీ రొటీన్ అవుతుందని వద్దని చెప్పాను. శ్రీదేవీ చాలా మంచి…
