‘విష్ణు విన్యాసం’ 27న రిలీజ్
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌తో బజ్ పెంచుతోంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ‘విష్ణు విన్యాసం’ చుట్టూ ఉన్న బజ్ ఇప్పుడు మరింత ఎగ్జైటింగ్‌గా మారింది. పెరుగుతున్న అంచనాలకు అనుగుణంగా మేకర్స్ ఈ సినిమాను ముందుగా ప్లాన్ చేసిన ఫిబ్రవరి 28 కంటే ఒక రోజు ముందే, ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీ విష్ణు పాత తేదీని క్రాస్ చేస్తూ కనిపించడం అలరించింది. అతని వెనుక…
