‘యూఫోరియా’ మూవీపై మహేష్ బాబు ప్రశంసలు – దర్శకుడు గుణశేఖర్
విభిన్నమైన కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు గుణ శేఖర్ గత వారం (ఫిబ్రవరి 6) ‘యుఫోరియా’ అంటూ బాక్సాఫీస్ సందడి చేశారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ, కథాంశంతో గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇటీవలె తెలంగాణ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గుణశేఖర్ మేకింగ్‌ను ఆయన కొనియాడారు…
