విశాల్ మొగుడు గ్లింప్స్ రిలీజ్.. సినిమాపై హైప్ పెంచేసిన వీడియో
తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు సుందర్ సి. అవ్ని సినీమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కుష్బూ సుందర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు A.C.S అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొగుడు అనే టైటిల్ తో రాబోతున్న చిత్రంలో విశాల్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. కమెడియన్ యోగిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మరోవైపు ప్రమోషన్స్…
