Skip to content

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న ఆరి అర్జునన్

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న  ఆరి అర్జునన్ Telugu News
‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న  ఆరి అర్జునన్ Telugu News

బిగ్ బాస్ విన్నర్, టాలెంటెడ్ యాక్టర్ ఆరి అర్జునన్ ప్రధాన పాత్రల్లో విజయ్ మిల్టన్ తెరకెక్కించిన చిత్రం ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్). ఆరి అర్జునన్ కథానాయకుడిగా నటించడమే కాకుండా సుందర్ బాబు, ముత్తయ్య అళగర్స్వామి మరియు జయ శీలన్ హెన్రీల సహకారంతో రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) విడుదల చేయబోతోన్నారు.

సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన విజయ్ మిల్టన్ ఇప్పుడు దర్శకుడిగా ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్)ను తెరకెక్కించారు. ఈ మూవీతో రాజ్ తరుణ్ తమిళ చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. భరత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుండగా.. సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అమ్ము అభిరామి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను అందుకుంది. కథను ఎక్కువగా రివీల్ చేయకుండా ఉత్కంఠను రేకెత్తించేలా కట్ చేశారు. ఇదొక ఫాస్ట్ ఫేస్డ్, ఎమోషనల్ సినిమా అని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీకి సామ్ సిఎస్ అందించిన బీజీఎం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. మిల్టన్ తన కెమెరాతో మాయ చేసినట్టుగా కనిపిస్తోంది.

ఆరి అర్జునన్ ఒక నిజాయితీ, ముక్కుసూటితో దూసుకుపోయే పోలీస్ అధికారిగా ఇందులో కనిపించనున్నారు. భరత్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది. రాజ్ తరుణ్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని అర్థం అవుతోంది. టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోంది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేందుకు ఈ మూవీని త్వరలోనే మేకర్స్ థియేటర్లలోకి తీసుకు రాబోతోన్నారు.