సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్…
‘గాయపడ్డ సింహం’ బిగ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన ‘గాయపడ్డ సింహం’ అన్‌లిమిటెడ్ ఫన్, మ్యాడ్‌నెస్, సర్ప్రైజ్ థియేట్రికల్ ట్రైలర్
తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ ‘గాయపడ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ కథ ఒక యువకుడి జీవితంలో జరిగే అనుకోని మలుపు చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలుకనే తను, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ అవుతాడు. అతని కలలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతాయి. ప్రేమ, భవిష్యత్తు.. ఒక్కసారిగా దెబ్బతినడంతో, తనలో పెరిగే నిరాశ, కోపం అతడిని ఒక విచిత్రమైన రివెంజ్ వైపు నడిపిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణాన్ని దర్శకుడు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారు.
దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గ్లోబల్ సమస్యను యువతకు కనెక్ట్ అయ్యేలా కథగా మలిచారు. సూర్య ప్రకాశ్ జ్యోసుల అందించిన కథలో భావోద్వేగం, వ్యంగ్యం, హాస్యం అన్నీ సమతుల్యంగా కనిపిస్తున్నాయి. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది.
తరుణ్ భాస్కర్ ఒక సాధారణ యువకుడిగా, ఆశలు-నిజాల మధ్య ఇరుక్కుపోయిన పాత్రను సహజంగా పోషించారు. ఆయన నటనలో భావోద్వేగం, నిరాశ, సరదా.. అన్నీ నేచురల్ గా కనిపిస్తున్నాయి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తూ కథకు మరింత అందాన్ని జోడించారు. విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సహాయ నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్‌లో కనిపిస్తూ ఇంటెన్స్ ను పెంచగా, శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తుంది.
టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా ఉంది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీకి మోడరన్, కలర్‌ఫుల్ టచ్ ఇవ్వగా, స్వీకర్ అగస్తి సంగీతం కథకు ఎనర్జీని జోడించింది. విప్లవ్ ఎడిటింగ్ సినిమా పేస్ ను కట్టుదిట్టంగా ఉంచగా, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్ విజువల్ రిచ్‌నెస్‌ను పెంచింది.
మొత్తానికి, ఇప్పటికే మంచి బజ్ ఉన్న ఈ చిత్రానికి ట్రైలర్ మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సమ్మర్‌లో న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ గా ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకులని అలరించబోతుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘గాయపడ్డ సింహం’ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నప్పుడు పవన్ ఈ సినిమా గురించి ప్రతిదీ చెప్తుండేవారు. ఇందులో నటిస్తున్న అందరూ నా మంచి ఫ్రెండ్స్. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. ప్రతి విజువల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది తప్పకుండా బిగ్ సమ్మర్ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సబ్జెక్ట్ అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది. మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్లాలని కల కంటారు. కాబట్టి ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కశ్యప్ గారు చక్కగా డైరెక్ట్ చేయడంతో పాటు మంచి క్యారెక్టర్ చేశారు. జెడి గారి సినిమాలు చిన్నప్పటి నుంచి చుస్తున్నాను. ఆయన వర్క్ అంటే నాకు ఇష్టం. పవన్‌తో చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. పవన్ కూడా మల్టీ టాస్కర్. ఈ సినిమాను ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ‘గాయపడ్డ సింహం’ గ్రేట్ కంటెంట్‌తో వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ: ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు చాలా నచ్చింది. కాన్సెప్ట్ బాగా అనిపించి వెంటనే కొనేశాం. నాలుగు రోజుల క్రితం సినిమా చూశాను. ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారు.. ట్రంప్ కూడా హీరోనే (నవ్వుతూ). చాలా మంచి కాన్సెప్ట్. 35 ఏళ్ల క్రితం జేడీ చక్రవర్తి చేసిన మనీ సినిమాల్లా ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. కశ్యప్ చాలా డీసెంట్‌గా స్క్రిప్ట్ డిజైన్ చేశాడు. నేను సినిమా చూస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇందులో ఈ ఇద్దరు హీరోలతో పాటు ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు(నవ్వుతూ). సెకండ్ హాఫ్‌లో ఐదు ఎపిసోడ్స్ థియేటర్‌లో బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అవి వర్క్ ఐతే ఇది మరో జాతిరత్నాలు అవుతుంది. శ్రీ విష్ణు క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో జేడీ సీరియస్‌గా ఉంటే, సెకండ్ హాఫ్‌లో నవ్విస్తాడు. చాలా ప్లాన్‌తో తెరకెక్కించారు. మే 1 కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆడియన్స్‌తో కలిసి సినిమా చూస్తాను.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ: అందరికీ హాయ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నేను ఎక్కువగా దుల్కర్ గురించి మాట్లాడాను. ఆయన పవన్‌తో చేస్తున్న సినిమా మామూలుగా ఉండదు. ‘గాయపడ్డ సింహం’ కోసం దిల్ రాజు గారు, జీ స్టూడియోస్ కలిసి రావడం అంటే ఈ సినిమాపై ఉన్న నమ్మకం మరింత పెరిగింది. దిల్ రాజు గారి జడ్జ్‌మెంట్ చాలా స్ట్రాంగ్. ఆయన ఈ సినిమాతో కలిసి రావడంతో మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ: దుల్కర్ గారి కలిసే అవకాశం వుంటుందని ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. ఆయనపై ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్న దిల్ రాజు గారికి ధన్యవాదాలు. మేమంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశాం. ఫస్ట్ 15 నిమిషాలు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు.
మానస మాట్లాడుతూ:అందరికీ నమస్కారం. ‘గాయపడ్డ సింహం’ను పెద్ద ప్లాట్‌ఫామ్‌కి తీసుకెళ్తున్న దిల్ రాజు గారికి థాంక్యూ సో మచ్. ఆయన ఎంచుకున్న సినిమాలకు అదృష్టం వస్తుంది. ఈ సినిమాకి కూడా అదే కలుస్తుందని నమ్ముతున్నాను. ఇది ఒక మంచి ఫన్ రైడ్. మేమంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా తీశాం. మే 1న అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను దుల్కర్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు నిర్మాతల్లో పవర్ స్టార్. ఆయన సపోర్ట్ మాకు చాలా బలం. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అన్ని నిర్మాతలకు ధన్యవాదాలు.
నిర్మాత భాను మాట్లాడుతూ: ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసిన మా పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ గారికి థాంక్యూ సో మచ్. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. ఆయన కోసం కథలు కూడా రాసుకున్నాను. మాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు.
పవన్ సాదినేని మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దుల్కర్ గారికి థాంక్యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులు ఆయనను ఎంతో ప్రేమిస్తారు. ‘గాయపడ్డ సింహం’ మే 1న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఎంత ఎంటర్టైనింగ్‌గా ఉందో, సినిమా అంతకంటే ఎక్కువ ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. దిల్ రాజు గారు మా సినిమాకి పెద్ద బలం. మే 1న మేము చెప్పిన దానికంటే సినిమా ఎక్కువ మాట్లాడుతుంది. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్
