సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ‘మార్గన్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విజయ్ ఆంటోని
మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని నటించిన కొత్త చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం. ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకున్న ఈ…