దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ గ్లింప్స్ విడుదల
దుల్కర్ సల్మాన్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బహుభాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్. ఎన్నో వైవిధ్యమైన, సరికొత్త పాత్రలతో ఆయన మెప్పిస్తున్నారు. ఈ విలక్షణత కారణంగానే ఆయన చేస్తున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటివే అందుకు ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ…