Skip to content

‘మహాకాళి’ 125 రోజుల షూటింగ్ పూర్తి

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి' చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్‌లో మరో కీలక మైలురాయిని కూడా ఈ చిత్రం చేరుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోహిత్ సరాఫ్ తన పాత్రకు…

Read more

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా: హీరో శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక…

Read more

హీరోయిన్ నభా నటేష్ నట ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్న “నాగబంధం”

టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త మూవీ "నాగబంధం"తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ నటిగా తన వెర్సటాలిటీతో అందరినీ ఆకట్టుకుంటోంది. "నాగబంధం" సినిమాలో పార్వతి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ నభా నటేష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఒకే పాత్రలో అనేక వైవిధ్యమైన భావోద్వేగాలను పలికించడం ద్వారా నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది నభా. దయ, పట్టుదల, దిక్కారం, బలహీనత, భక్తి..ఇలా అనేక ఎమోషన్స్ ను తన నటనలో పలికించింది అందరి ప్రశంసలు అందుకుంటోందీ నాయిక. తారలకు ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఆ అవకాశాన్ని తన టాలెంట్, డెడికేషన్ తో సద్వినియోగం చేసుకుంది నభా…

Read more

‘మా సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు?’ T-Series నోటీసులపై ‘SPIRIT ‘ చిత్ర నిర్మాతల ఆగ్రహం

మా "SPIRIT IS NOT ONE" చిత్ర టైటిల్‌కు సంబంధించి ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ T-Series పంపిన నోటీసులపై మరియు వారు విధించిన షరతులపై చిత్ర నిర్మాతలు శ్రీమతి చిన్నబోయిన నరసమ్మ మరియు శ్రీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా తీవ్రంగా స్పందించారు. ​ ​1. T-Series పంపిన నోటీసులోని షరతులు ఏమిటి? ​హిందీ రైట్స్ ఇవ్వబోం: 'SPIRIT' అనే పదంపై మాకే హక్కులు ఉన్నాయి కాబట్టి, మీ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకోవాలి. హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదు. ​కేవలం తెలుగులోనే ప్రమోషన్స్: "SPIRIT IS NOT ONE" అనే పేరుతో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే థియేటర్లలో, ఓటీటీ (OTT)…

Read more

రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా “ఫైట్ మహా” టీజర్ లాంఛ్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కేరళ లలో షూటింగ్ జరుపుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంఛ్ చేశారు. ఈ…

Read more

ఘనంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో “1=100” టీజర్ లాంచ్

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో హీరో కృష్ణ కుమార్ మరియు హీరోయిన్ అర్పిత లోహి చిత్రం "1=100" టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ…

Read more

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

▪️జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ▪️ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా వేడుక ▪️తెలంగాణ ఉద్యమకారిణి కోమలి సినిమాను ఆదరించాలి: కల్వకుంట్ల కవిత ▪️ చిన్న సినిమాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత ▪️"ఒక ఆడబిడ్డ కన్నీటి కథే ఈ సినిమా" –నిర్మాత కోమలి హైదరాబాద్: ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్…

Read more

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఈ సంస్థకి , ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు. – ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన!

ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా…

Read more

ప్రభాస్ లాంచ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’ టీజర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించగా, ఫస్ట్ సింగిల్ 'కంసంనిద' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ప్రారంభంలో కనకరాజు వాయిస్ ఓవర్‌తో తన రాయలసీమలోని పెనుకొండ ఊరిని పరిచయం చేస్తాడు. అల్లరి, సరదాగా తిరిగే కనకరాజు జీవితం ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సమయంలో…

Read more

‘రాజా ది రాజా’ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్: నిర్మాత కె. నిహారిక దాసరి

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నిర్మాతగా మారాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? నిర్మాతగా మారడానికి నాలుగైదేళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను…

Read more